లడాఖ సరిహద్దుల్లో చైనా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికా జనరల్ ఛార్లెస్ ఏ ఫ్లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు చాలా ఆందోళనకర రీతిలో జరుగుతున్నట్లు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చైనా విధానాలు ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు ఉన్నాయని, ఆ దేశ ప్రవర్తన ఆమోదయోగం లేదన్నారు. హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.














