Namaste NRI

రంగమార్తాండ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ కాబోతుంది. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌, అలీ రెజా తదితరులు నటిస్తున్నారు. ఇళయరాజాతో సంగీత ప్రయాణం ఓ ఆద్మాత్మిక అనుభవం అంటున్నారు కృష్ణవంశీ. ప్రస్తుతం నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మ్యూజిక్‌ డైరీస్‌ అంటూ ఆ పనులకి సంబంధించిన వీడియోల్ని కృష్ణవంశీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events