తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కుర్మాచలం ను నియమించడం పట్ల టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అని అన్నారు. టీఆర్ఎస్లో పని చేసే ప్రతి కార్యకర్త స్వదేశంలో ఉన్నా లేదా విదేశాలలో ఉన్నా సరైన సమయంలో సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మలేషియా ఉపాధ్యక్షుడు మారుతి శర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, సత్యనారాయణరావు నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవీందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, నవీన్ బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గారు, సందీప్ కుమార్ లగిశెట్టి తదితరులు పాల్గొన్నారు.














