Namaste NRI

అమెరికా గాయకుడు కెల్లీకి 30 ఏళ్ల జైలు శిక్ష

అమెరికా గాయకుడు ఆర్‌ కెల్లీకి వేధింపుల కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష పడిరది. ఐ బిలీవ్‌ ఐ కెన్‌ ఫ్లై, ఇగ్నీషన్‌ లాంటి హిట్‌ పాటలతో ఫేమస్‌ అయిన సింగర్‌ కెల్లీ తన వద్దకు వచ్చిన మహిళలు, చిన్నారులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  సెలబ్రిటీ స్టేటస్‌ను వాడుకుని చిన్నారులు, మహిళలను వేధించడమే కాకుండా సెక్స్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు కెల్లీపై కేసు నమోదు అయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ కేసులో దోషిగా తేలాడు. సింగర్‌ పూర్తి పేరు రాబర్ట్‌ సిల్వస్టర్‌ కెల్లీ.   శృంగరాన్ని ఆయుధంగా వాడుకుని సింగర్‌ కెల్లీ నేరాలకు పాల్పడినట్లు జడ్జి తన తీరులో తెలిపారు. అయితే ఈ కేసులో మళ్లీ అప్పీల్‌ చేయనున్నట్లు అతని తరపు లాయర్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events