హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్ భూముల వేలంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీఎస్ఐఐసీకి) కాసుల పంట పండిరది. 14.91 ఎకరాల భూములకు రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్ల ధర పలికింది. మంజీరా కన్స్ట్రక్షన్స్ 2.92 ఎకరాలను రూ.160.60 కోట్లకు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలోని హైదరాబాద్ మాహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భూములను ఇ`వేలం పద్ధతిలో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ ద్వారా విక్రయించింది. టీఎస్ఐఐసీ భూముల అమ్మకాలు చేపట్టింది.
ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లుగా ఉండగా.. గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. ఎకరానికి రూ.25 కోట్ల ప్రారంభ ధరతో ఫ్లాట్ నంబరు 4లో 3.15 ఎకరాలు, 6లో 3.15 ఎకరాలు, 12లో 3.69 ఎకరాలు, 14లో 2.92 ఎకరాలను, ప్లాట్ నంబరు 17లో రెండు ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా భారీ స్పందన లభించింది. టీఎస్ఐఐసీ భూములకు భారీ ధర పలకడం గత ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ సాధించిన సుస్థిర అభివృద్ధి ఫలితమేనని పరిశ్రమలు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.