Skip to main content

Namaste NRI

రుద్రుడు విచ్చేసేది ఆరోజే

నటుడు, దర్శకుడు  కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌. శరత్‌కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రాన్ని దర్శకుడు కతిరేసన్‌ రూపొందిస్తున్నారు. చెడ్డవాళ్లు పుట్టరు, తయారు చేయబడతారు అనే క్యాప్షన్‌ను పెట్టారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించారు. డిసెంబర్‌ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడిరచారు. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో లారెన్స్‌ చేతిలో సీరియస్‌గా చూస్తు ఆసక్తికరంగా కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రాఘవ లారెన్స్‌ సినిమాలకో ప్రత్యేకత ఉంటుంది. హీరోయిజం, మంచికథతో ఆయన చిత్రాలు తెరకెక్కుతుంటాయి. ఈ సినిమాలో మంచి యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. లారెన్స్‌ క్వారెక్టరైజేషన్‌ కొత్తగా  ఉంటుంది అన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News