Skip to main content

Namaste NRI

ఐశ్వర్య రాజేష్‌ డ్రైవర్‌ జమున ట్రైలర్‌ విడుదల

అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్‌. తాజాగా డ్రైవర్‌  జమున పేరుతో మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ రోడ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా.కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌ ఎస్‌.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా క్యాబ్‌ డ్రైవింగ్‌ని వృత్తిగా మార్చుకుంటుంది జము.  ఒక రైడ్‌ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ రైడ్‌ ఆమె క్యాబ్‌ల్లో ప్రయాణించే ప్రయాణీకులను నేర నేపథ్యం వుండటం, వారి ప్రాణాలకు ముప్పు ఉన్నందున జమున కూడా ప్రమాదంలో పడటం. చివరికి ఈ ప్రమాదం నుండి జమున ఎలా బయటపడిరది అనేది కథలో కీలకాంశం. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె ప్రతి ఒక్క సీన్‌లో ఎటువంటి డూప్‌ లేకుండా నటించారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News