Skip to main content

Namaste NRI

 మీలో ఒకడు.. రిలీజ్‌కు రెడీ

శ్రీనివాస్‌ కుప్పిలి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మీలో ఒకడు. హ్రితిక సింగ్‌, సాధన పవన్‌ కథానాయికలు. సుమన్‌ కీలక పాత్రలో నటించారు. సీనియర్‌ నటులు కృష్ణ భగవాన్‌, సమీర్‌, అశోక్‌ కుమార్‌, బస్టాప్‌ కోటేశ్వరావు, గబ్బర్‌ సింగ్‌ బ్యాచ్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు  శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంచి కథ, కథనాలలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా రూపొందించాం. వినోదం, పాటలు, ఫైట్స్‌ చిత్రాన్ని ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.  కుప్పిలి వీరాచారి నిర్మాత. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జై సూర్య, ఛాయాగ్రహణం: పి.శ్రీను.

Social Share Spread Message

Latest News