అగ్రరాజ్యం అమెరికాకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను ఎకనామిక్ యుద్ధంగా రష్యా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రష్యా అమెరికాకు ఇదే విషయంలో వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా కనుక ఉక్రెయిన్ యుద్దాన్ని కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు. అమెరికా కనుక అలాంటి చర్యలు తీసుకుంటే అలస్కాను తాము తిరిగి లాగేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
అంతకు ముందు అలస్కాలో రష్యన్ కాలనీలు ఉండేవి. అయితే ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ ప్రాంతాన్ని అమెరికాకు అమ్మేయడం జరిగింది. తమకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకున్న అగ్రరాజ్యం 1867లో కేవలం 7.2 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించి అలస్కాను కొనేసింది.














