Namaste NRI

కబీర్‌లాల్‌ దర్శకుడిగా ఈషా చావ్లా దివ్య దృష్టి

 ప్రముఖ దర్శకుడు కబీర్‌ లాల్‌ దివ్య దృష్టి సినిమాతో తెలుగులో పరిచయమవుతున్నారు. ఈషా చావ్లా ఇందులో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా  దర్శకుడు కబీర్‌ లాల్‌ మాట్లాడుతూ తన సోదరి హత్యకు కారణమైన వారిని వెతికి కనిపెట్టాలనుకునే కంచిచూపులేని అమ్మాయి కథే దివ్వదృష్టి. హంతకులను వెతకడానికి ఆమె చేసిన కృషి, తదనంత పరిస్థితులు కీలకంగా సాగే కథతో దివ్య దృష్టి రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా తెలుగులో దర్శకుడిగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది అన్నారు. కమల్‌ కామరాజు, నిళల్‌గల్‌ రవి, తులసి, కబీర్‌లాల్‌, ఈషా చావ్లా, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  లవ్లీ వరల్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమాను అజయ్‌ కుమార్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షాహిద్‌ లాల్‌, నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events