టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగతులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా విచ్చేసి పరామర్శించారు. తొలుత కృష్ణంరాజు నివాసానికి వచ్చిన వీరు కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణంరాజు గారు చనిపోయినప్పుడు టర్కీ షెడ్యూల్లో ఉన్నారు బాలకృష్ణ. అందుకే అప్పుడు ఆయన పార్దివ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్న గారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగాను. సినిమా ఇండ్రస్టీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ. అలాంటి అద్భుతమైన నటడితో తనకు కూడా నటించే అవకాశం వచ్చిందని, తామిద్దం సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించాము అనే విషయం గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.