Skip to main content

Namaste NRI

క్రిస్మస్‌ కానుకగా ఛాంపియన్‌ రిలీజ్ 

రోషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ఛాంపియన్‌. అర్జున్‌ అద్వైతం దర్శకుడు. జీ తెలుగు సమర్పణలో స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నదనీ, మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని కూడా పూర్తి చేస్తున్నామని, ఇండియన్‌ బాక్సాఫీస్‌కు ఈ సినిమా పెద్ద బూస్ట్‌ని ఇవ్వనున్నదని మేకర్స్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌డేట్‌ పోస్టర్‌లో లాంగ్‌ డార్క్‌ ఓవర్‌కోట్‌ ధరించి క్లాసీ లుక్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్‌ నుంచి బయటకొస్తున్న హీరో రోషన్‌ని చూడొచ్చు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.మదీ, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఆర్ట్‌: తోట తరణి.

Social Share Spread Message

Latest News