Skip to main content

Namaste NRI

వికసిత్ భారత్ పరుగును విజయవంతంగా నిర్వహించిన బ్రూనైలోని భారత రాయబార కార్యాలయం

భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

వికసిత్ భారత్ 2047 దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి శ్రీ రాము అబ్బగాని గారు మాట్లాడుతూ, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక, “దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు.

ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. వారు నిరంతరం భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని మరియు ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు.ఈ కార్యక్రమం ఘనవిజయవంతం కాగా, వికసిత్ భారత్ దిశగా బ్రూనైలోని భారతీయ సమాజం యొక్క భాగస్వామ్య భావనను ప్రతినిధ్యం వహించింది.

Social Share Spread Message

Latest News