Skip to main content

Namaste NRI

అర్జున్ సర్జా సీతా పయనం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

సీనియర్‌ నటుడు అర్జున్‌ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రేమకథాచిత్రం సీతా పయనం. ఐశ్వర్య అర్జున్‌, నిరంజన్‌ ప్రధాన పాత్రధారులు. అర్జున్‌, ధ్రువ సర్జా శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ధ్రువ సర్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. యాక్షన్‌ హల్క్‌గా ఈ పోస్టర్‌లో ధ్రువ సర్జా కనిపిస్తున్నారు. సత్యరాజ్‌, ప్రకాశ్‌రాజ్‌, కోవై సరళ, ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: జి. బాలమురుగన్‌, నిర్మాణం: శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌.

Social Share Spread Message

Latest News