ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ రూ.9,860 కోట్ల (1.2 బిలియన్ యూఎస్ డాలర్లు) విరాళాన్ని ప్రకటించింది. 2026 నాటికి పోలియో కట్టడే లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాల అమలుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రకటిచింది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 పోలియో కేసులు నమోదైన పాకిస్థాన్, 2 కేసులు వెలుగు చూసిన అఫ్గానిస్థాన్ దేశాల్లో ఆ వైరస్ను అందమొందించడానికి చొరవ చూపుతున్నట్లు ఆ ఫౌండేషన్ స్పష్టం చేసింది. కొత్తరకం పోలియో వైరస్ను అరికట్టడానికి కూడా ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)