Skip to main content

Namaste NRI

గేట్స్‌ ఫౌండేషన్‌ రూ.9,860 కోట్ల విరాళం

ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ రూ.9,860 కోట్ల (1.2 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) విరాళాన్ని ప్రకటించింది. 2026 నాటికి పోలియో కట్టడే లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాల అమలుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రకటిచింది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 పోలియో కేసులు నమోదైన పాకిస్థాన్‌, 2 కేసులు వెలుగు చూసిన అఫ్గానిస్థాన్‌ దేశాల్లో ఆ వైరస్‌ను అందమొందించడానికి చొరవ చూపుతున్నట్లు ఆ ఫౌండేషన్‌ స్పష్టం  చేసింది. కొత్తరకం పోలియో వైరస్‌ను అరికట్టడానికి కూడా ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో పేర్కొంది.

Social Share Spread Message

Latest News