సౌదీ అరేబియాలోని ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా ప్రతినిధి బృందం రియాధ్ లోని భారతీయ రాయబార అధికారవర్గాలతో సమావేశమైంది. భారతీయ ఎంబసీలోని సీనియర్ దౌత్యవేత్త అయిన యన్.రాంప్రసాద్‌తో సాటా ప్రతినిధి బృందం సమావేశమై సంఘం చేపడుతున్న సాంస్కృతిక, సామాజిక సేవ కార్యక్రమాలను వివరించినట్లుగా సాటా తెలిపింది. సంస్థ కార్యకలాపాలను వివరించి దేశాభివృద్ధిలో కూడా తాము భాగస్వామ్యం అవుతామని తెలిపారు. దీంతో స్పందించిన ఎంబసీ అధికారులు సాటా ప్రతినిధి బృందాన్ని అభినందించినట్టు మల్లేశన్ వెల్లడించారు.














