Skip to main content

Namaste NRI

ఛాంపియన్ నుంచి సల్లంగుండాలే రిలీజ్

స్వప్న సినిమాస్‌ పతాకంపై రాబో తున్న కొత్త చిత్రం ఛాంపియన్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్‌, అనస్వర రాజన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మేకర్స్‌ సెకండ్‌ సింగిల్‌ సల్లంగుండాలే ను రిలీజ్‌ చేశారు.

వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం – మొత్తం గ్రామం – వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్‌ అద్భుతంగా ప్రజెంట్‌ చేసింది. మిక్కీ జె మేయర్‌ మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు. చంద్రబోస్‌ సాహిత్యం వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా ప్రజెంట్‌ చేసింది గాయకులు రితేష్‌ జి రావు, మనీషా ఈరబత్తిని తమ వోకల్స్‌తో మరింత అందాన్ని తీసుకొచ్చారు. గోపాల్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా ఉంది. నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్‌, అనశ్వర రాజన్‌ జోడి డ్యాన్స్‌తో పాటకు ఉత్సాహాన్ని తెచ్చారు. ఈ సాంగ్‌ ప్రతి వివాహ వేడుకలో మోగబోతుంది. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events