గౌతమ్‌కార్తిక్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ఆగస్టు 16, 1947. ఎస్.ఎస్.పొన్‌కుమార్ దర్శకుడు. ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి భారీ బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహా నిర్మాత. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర సమర్పకుడు ఏ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ పీరియాడిక్ మూవీ ఇది. 1947 ఆగస్ట్ 14,15,16 తేదీల్లో ఓ మారుమూల పల్లెటూరిలో కథ జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని ఆ గ్రామస్తులకు చేరకుండా ఓ బ్రిటీష్ అధికారి దాచిపెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథ. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాని విడుదల చేస్తున్న మధు గారు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇదని హీరో గౌతమ్ కార్తిక్ తెలిపారు. ఠాగూర్ మధు మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా క్లెమాక్స్ చూస్తుంటే ఉద్వేగానికి లోనయ్యాను అన్నారు.