Skip to main content

Namaste NRI

ఆగస్ట్‌ 16న ఏం జరిగింది?

 గౌతమ్‌కార్తిక్‌ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ఆగస్టు 16, 1947. ఎస్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ దర్శకుడు. ఏఆర్‌.మురుగదాస్‌  ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి భారీ బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహా నిర్మాత. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.   ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర సమర్పకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ పీరియాడిక్‌ మూవీ ఇది. 1947 ఆగస్ట్‌ 14,15,16 తేదీల్లో ఓ మారుమూల పల్లెటూరిలో కథ జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని ఆ గ్రామస్తులకు చేరకుండా ఓ బ్రిటీష్‌ అధికారి దాచిపెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథ. యాక్షన్‌, ఎమోషన్స్‌, కామెడీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాని విడుదల చేస్తున్న మధు గారు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇదని హీరో గౌతమ్‌ కార్తిక్‌ తెలిపారు. ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా  క్లెమాక్స్‌ చూస్తుంటే ఉద్వేగానికి లోనయ్యాను అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events