Skip to main content

Namaste NRI

తెలుగుతేజం పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడిరచిన సంగతి తెలిసిందే. తాజాగా స్వదేశానికి చేరుకున్న సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, నిర్మలా సీతారామన్‌, కిషన్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events