పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టార్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ పంజాలో గ్యాంగ్‌స్టార్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టార్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూట్‌లో పవన్ కూడా జాయిన్ అయిపోయాడు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ప్రియాంక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పుడు ఏకంగా పవన్‌కు జోడీగా నటిస్తుందంటే విశేషం అనే చెప్పాలి.

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు దానయ్య ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తు న్నారు.

