Skip to main content

Namaste NRI

ఖతార్ లో ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలు ప్రవాసాంధ్ర ఖతార్ తెలుగుదేశం అద్వర్యం లో ఘనంగా జరిగినవి. పెద్దఎత్తున తెలుగుదేశం కుటుంబసభ్యులందరు హాజరై కేకు కోసి జన్మదిన శుభాకాంక్ష లు తెలియచేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ జగన్ అరాచక పాలనను అంతమొందించి ఎలాగైనా మన చంద్రబాబు గారిని మరల అధికారంలోకి తీసుకునివచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడపాలని కోరారు. 

ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు విభజన గాయాలు మరియు లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో తీసుకొనివెళుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసి మరియు భావిపౌరుల బంగారు భవిషత్ నిరంతరం నిర్వీర్యం చేస్తూ పాలనా సాగిస్తున్నారని తెలిపారు. 

ఉపాధ్యక్షులు మద్దిపోటి నరేష్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు అందరు పెద్దఎత్తున పార్టీకి సహాయ సహకారాలు అందించాలని, అధినాయకుని ఆదేశాల మేరకు పార్టీకి చేయూతనందించి పూర్వ వైభవాన్ని తీసుకునిరావాలని కోరారు . గల్ఫ్ సంఘం ఖతార్ కార్యవర్గ సభ్యుడు మలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన యం ఎల్ సి ఎన్నికలలో అనుసరించిన వ్యూహాలు సత్పలితాలు ఇవ్వడంతో రాబోయే ఎన్నికలలో కూడా ఇటువంటి వ్యూహాలనే అనుసరించి విజయం సాధించి చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని చెప్పారు.

కోశాదికారి విక్రమ్ సుఖవాసి , సాంఘిక ప్రసార మాధ్యమం సమన్వయకర్త గోవర్ధనరెడ్డి, ఈ కార్యక్రమ సమన్వయకర్త దాసరి రమేష్ , దండా విజయభాస్కర్  మాట్లాడుతూ మన పార్టీని తిరిగి అధికారంలోనికి తీసుకొని వచ్చి తెలుగువారి ఆత్మగౌరన్ని కాపాడాలని కోరారు. ఇప్పటికే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపూ రావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని మనమందరూ ఉపయోగించుకొని ప్రజలందరినీ మన పార్టీవైపు తీసుకు రావడానికి తగిన వ్యూహాలు రచించాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున ముస్లిం సోదరులు పాల్గొని అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఇఫ్తార్ విందు మరియు భోజన కార్యక్రమాలు ముగించిన తరువాత దీర్ఘాయుషు చంద్రబాబుగారు మరియు జై చంద్రబాబు నాయుడు గారు నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు .

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events