అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేపట్టిన నాట్స్ తెలుగమ్మాయి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ నాట్స్ తెలుగమ్మాయి విజేతకు తమ సినిమాలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా చేపట్టిన తెలుగమ్మాయి కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నిర్వహించే తెలుగమ్మాయి పోటీల్లో విజేత ఎవరైనా సరే వారికి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ భవిష్యత్తులో నిర్మించే సినిమాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.


