Skip to main content

Namaste NRI

కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు  ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైట్‌ అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, గల్ఫ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు రావి రాధా కృష్ణ, సభ్యులు వెంకట్‌ కోడూరి, ప్రధాన కార్యదర్శి మల్లి మరొతు పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగాయి.    ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి ఆరుపదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈ రంగంలోనూ అనితరసాధ్యమైన విజయాలను అందుకున్నారని తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారన్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారని పేర్కొన్నారు.  మహిళలకు హక్కులు పంచి, పేదలకు సంక్షేమం అందించారన్నారు.  తెలుగువారి చరిత్ర చెప్పుకొన్నంత కాలం తన గురించి చెప్పుకొనేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలిపారు.  మహానాడుకు రుచికరమైన వంటకాలు అందించిన వై. కోట గ్రామస్థులకు,  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వారికి ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ అధ్యక్షులు కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావి వెంకటేశ్వర్‌ రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, టీడీపీ కడప నియోజకవర్గం ఇంఛార్జి అమీర్‌ బాబు, గౌరవ అతిథులు టీడీపీ బద్వేల్‌ నియోజకవర్గం ఇంఛార్జి కొండ్రెడ్డి రితేష్‌ రెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్‌ రాజు,  తెలుగుదేశం పార్టీ మదనపల్లె నియోజకవర్గం నాయకులు రామినేని జయరాం నాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్‌, రాజంపేట పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు టి. నవీన్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు.  ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ అన్నీ గవర్నరేట్ల కో ఆర్డినేటర్స్‌, జాయింట్‌ కో ఆర్డినేటర్స్‌, వివిధ విభాగాలు, మహిళా విభాగాలు, వారి కమిటీలు, పలువురు రాజకీయ నేతలు, తెలుగు సంఘాలు విచ్చేసి సభను విజయవంతం చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events