Namaste NRI

అమెరికా చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం…. ఉక్రెయిన్ కు

ఉక్రెయిన్ ద‌ళాల‌కు ఎఫ్‌-16 ఫైట‌ర్ విమానాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని అమెరికా యోచిస్తున్న‌ది. జ‌పాన్‌లో జ‌రుగుతున్న జీ7 స‌మావేశాల్లో దీనిపై అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ జేక్ సుల్విన‌న్ తెలిపారు. అత్యంత అధునాత‌న ఎఫ్‌-16 ఫైట‌ర్ విమానాల విష‌యంలో కీవ్ పైలెట్ల‌కు అమెరికా ద‌ళాలు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. ఎఫ్‌-16 ఫైట‌ర్ జెట్స్ కావాల‌ని ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి అమెరికాను అభ్య‌ర్థిస్తున్న‌ది. అమెరికా చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events