భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా తీపికబురు చెప్పింది. గ్రీన్‌కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖాస్తుల కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఈ గైడెన్స్ జారీచేసింది. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెకీలకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభ ఈఏడీకి అర్హత పొందేందుకు దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరాలను గైడెన్స్ వివరిస్తుంది. ఆమోదించిన ఫారం ఐ-140 ప్రధాన లబ్ధిదారుడిగా ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే నాన్-ఇమ్మిగ్రెంట్ హోదా లేదా అధీకృత గ్రేస్ పీరియడ్‌లో ఉండటం, బయోమెట్రిక్, క్రిమినల్ నేపథ్యం గురించిన వివరాలను సమర్పించడం వంటివి ఉన్నాయి.


