Namaste NRI

ఫాదర్స్‌ డే సందర్భంగా మా నాన్న సూపర్‌ హీరో ప్రీలుక్‌  పోస్టర్‌ విడుదల

సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రానికి మా నాన్న సూపర్‌ హీరో అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సుధీర్ బాబు సరసన ఆర్నా కథానాయికగా నటిస్తోంది.  ఫాదర్స్‌డేను పురస్కరించుకొని ప్రీలుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి లూసర్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. వి సెల్యులాయిడ్‌, సీఏఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపారు. సాయిచంద్‌, షాయాజీషిండే, రాజు సుందరం, శకాంక్‌, ఆమని, హర్షిత్‌ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ కల్యాణి, సంగీతం: జై క్రిష్‌, నిర్మాత: సునీల్‌ బలుసు. ఈ మాన్సూన్ లో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Social Share Spread Message

Latest News