విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్దకాపు-1. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. నిర్మాత మాట్లాడుతూ అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ఇది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. విరాట్ కర్ణ పాత్రతో పాటు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది అన్నారు. రావు రమేష్, ఆడుకలం నరేష్, తనికెళ్లభరణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆగస్ట్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి.జె.మేయర్.


