చైతన్యరావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. చెందు ముద్దు దర్శకుడు. బిగ్‌బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. మిహిరా, వైరా రాఘవ, లలిత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అగ్ర హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇందులో లవ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. 90 దశకం నేపథ్యాన్ని ఎంచుకోవడంతో కొత్త ఫీల్ వచ్చింది. ఆనాటి వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ వినోదానికి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. ప్రథమార్థమంతా వినోదాత్మకంగా సాగుతుందని, ద్వితీయార్థంలో క్రైమ్ ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత యష్ రంగినేని చెప్పారు. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, రచన-దర్శకత్వం: చెందు ముద్దు.


