నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. యుక్తి తరేజా నాయిక. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ఇలాంటి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాం అన్నారు. ఈ సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ ఉంటుంది. దర్శకుడు బాధ్యతగా, నిజాయితీగా సినిమా తీశాడు. భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం మరో స్థాయిలో ఉంటుంది. ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల తదితరులు పాల్గొన్నారు.


