పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ పోలీస్ యూనిఫామ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి భారీ సెట్‌ను తీర్చిదిద్దారు.ఇందులోనే పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాం. సినిమాలో ఇవి ప్రధానార్షణగా నిలుస్తాయి అని చిత్రబృందం పేర్కొంది.ఈ చిత్రంలో అశుతోష్ రానా, నవాబ్షా, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.


