Skip to main content

Namaste NRI

నవీన్ చంద్ర హీరోగా ఎలెవెన్ ప్రారంభం

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఓ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎలెవెన్  అ టైటిల్ ని ఖారారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో  అభిరామి, దిలీపన్, రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  దర్శకుడు లోకేశ్ అజ్ల్స్ మాట్లాడుతూ  మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే  ఫాస్ట్-పేస్డ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ప్రతిభావంతులైన నటీనటుల, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నిర్మాతలకు  ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ 23 నుంచి ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.  డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.

Social Share Spread Message

Latest News