Skip to main content

Namaste NRI

అమెరికా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు : ఇరాన్‌

అమెరికా నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్‌ విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటీరియర్‌ మంత్రి మోహసీన్‌ నఖ్వీ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ చేరుకొన్న వేళ ఈ వివరణ రావడం గమనార్హం. నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల నిమిత్తమే వచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌ నుంచి అమెరికాకు మొత్తం ఏడు షరతులు వెళ్లాయి.

ఇందుకోసం ఖతార్‌ మధ్యవర్తులను వాడుకుంది. డిమాండ్లను తిరస్కరిస్తే తాము నిర్ణయాత్మక యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు దీనిలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ మోహసీన్‌ రెజాయి స్పందిస్తూ ఖతార్‌ ఇప్పటికే అమెరికాకు వీటిని చేరవేసిందని, అధ్యక్షుడు ట్రంప్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. యుద్ధాన్ని ముగించడం, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటివి ఈ డిమాండ్‌ల్లో ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events