దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ కింగ్ ఆఫ్ కోథా. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ ఇంత భారీ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి. ఈ చిత్రంలో నా పాత్ర పేరు తార. దుల్కర్ పేరు రాజు. మా ఇద్దరి మధ్య అందమైన లవ్‌స్టోరీ కూడా వుంది. చాలా ఆసక్తికరమైన సినిమా ఇది. ఈ లవ్‌స్టోరీకి బ్రిలియంట్ మ్యూజిక్ ట్రాక్ వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం నాకు మంచి పేరును తీసుకువస్తుంది. కథానాయికగా అన్ని రకాల పాత్రలను చేయాలని వుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర చేయాలని వుంది అని చెప్పింది.
