Skip to main content

Namaste NRI

కింగ్‌ ఆఫ్‌ కోథా అలరిస్తుంది.. ఐశ్వర్య లక్ష్మీ

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ కింగ్‌ ఆఫ్‌ కోథా. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ ఇంత భారీ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి.  ఈ చిత్రంలో నా పాత్ర పేరు తార. దుల్కర్‌ పేరు రాజు. మా ఇద్దరి మధ్య అందమైన లవ్‌స్టోరీ కూడా వుంది. చాలా ఆసక్తికరమైన సినిమా ఇది. ఈ లవ్‌స్టోరీకి బ్రిలియంట్‌ మ్యూజిక్‌ ట్రాక్‌ వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం నాకు మంచి పేరును తీసుకువస్తుంది. కథానాయికగా అన్ని రకాల పాత్రలను చేయాలని వుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్‌ పాత్ర నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర చేయాలని వుంది అని చెప్పింది.

Social Share Spread Message

Latest News