Skip to main content

Namaste NRI

లండన్‌లో ఈగల్‌ హంగామా

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక.  కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల ఇతర ముఖ్య తారాగణం తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ లండన్‌లో ప్రారంభమైంది. ఇందులో రవితేజతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. రవితేజ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.  ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీనాగేంద్ర తంగాల, సంభాషణలు: మణిబాబు కరణం, స్క్రీన్‌ప్లే: కార్తీక్‌ ఘట్టమనేని, మణిబాబు కరణం, రచన-దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని.

Social Share Spread Message

Latest News