Namaste NRI

సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయం…రాధారపు సతీష్ కుమార్

తెలంగాణ‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేన‌ని , కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీఆర్ఎస్ 115 ఎమ్మెల్యే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించ‌డంతో  సీఎం కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలియ‌జేశారు. బాధ్యత గల బీఆర్ఎస్ కార్యకర్తగా మా వంతు బాధ్యత నిర్వహించడానికి బృందంగా వచ్చి బీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శoగా నిలుస్తున్నాయి . రాష్ట్రంలో కాంగ్రెస్ , బిజెపిల‌కు చోటు లేద‌న్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ,బిజెపి పార్టీలకు సరైన గుణపాఠం చెపుతార‌న్నారు.  తెలంగాణ‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణా పునర్నిర్మాణం వరకు కేసీఆర్ వెంట ఉన్నామో, ఎన్నికల్లో సైతం ఉద్యమ స్ఫూర్తితో, కేసీఆర్ నాయకవత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events