Skip to main content

Namaste NRI

కుమారి శ్రీమతి ట్రైలర్‌ ను లాంచ్ చేసిన నాని

నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ కుమారి శ్రీమతి. గోమటేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్‌ అవసరాల స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను హీరో నాని ఆవిష్కరించారు. ఇందులో బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్యసాహసాలు మూర్తీభవించిన మహిళగా నిత్యామీనన్‌ కనిపించింది. ఈ తరానికి చెందిన ఆధునిక మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు.

 గౌతమి, నరేష్, తాళ్లూరి రామేశ్వరి, మురళీ మోహన్, ప్రణీత పట్నాయక్, తిరువీర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే,  డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7-ఎపిసోడ్స్ ల సిరీస్‌ కు స్టాకాటో, కమ్రాన్ పాటలు అందించారు.  మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పని చేశారు. చందు నిమ్మగడ్డ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి కుమారి శ్రీమతి సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది.

Social Share Spread Message

Latest News