Skip to main content

Namaste NRI

వాషింగ్టన్ లో ఘనంగా ధూళిపాళ్ల నరేంద్ర జన్మదిన వేడుకలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సిలో సంగం డైరీ చైర్మన్, పొన్నూరు మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం, జనసేన పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుంటూరు  జిల్లాలో వివాదరహితునిగా సాగుతూ, ప్రభుత్వ కక్షపూరిత విధానాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని ప్రజా గొంతుకై తన వాణిని నిత్యం వినిపిస్తున్నారు. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో కోల్పోయిన సీటును మరికొద్ది నెలల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రజామోదం పొంది, మంత్రిగా బాధ్యతలతో మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునరంకితమవ్వాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసి, చరవాణిలో నరేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువైన గుంటూరు జిల్లా నుండి తండ్రి, మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఘన వారసత్వ రాజకీయ విలువలతో 1993 నుండి , తెలుగుదేశం పార్టీలో అంచలంచెలుగా ఎదిగి, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడిగా, లక్షలాది గ్రామీణ రైతు కుటుంబాలకు, దశాబ్దాలుగా చేయూతనిస్తున్న సంగం డైరీ చైర్మన్‌‌గా పూర్తి స్థాయి బాధ్యతలు ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ, క్రమశిక్షణగల ప్రజా నాయకునిగా ఎదిగారని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, భాను మాగులూరి, విజయ్ గుడిసేవ, యాష్ బొద్దులూరి, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, భార్గవ్, మురళి రెడ్డి, వలేటి భాను, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events