మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ముఖేశ్ సింగ్ దర్శకత్వం. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ప్రభాస్‌తో, ఎం.మోహన్‌బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మూడోతరం నటుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విష్ణు తనయుడు మంచు అవ్రామ్ కన్నప్పతో బాల నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఈ చిత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు నటిస్తు న్నట్టు అయ్యింది. అవ్రామ్ పాత్రకు కన్నప్పలో చాలా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు మాట్లాడుతూ నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది మా కుటుంబ మూడు తరాల కలయికతో వస్తున్న అరుదైన సినిమా అని చెప్పుకొచ్చారు.
