వెయ్యి డాలర్లు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలుచేశారు. కెన్నెత్ యుగెన్ స్మిత్ (58) అనే దోషికి అలబామా జైలులో ఈ శిక్ష అమలు పరిచారు. అతని ముఖానికి ఫేస్ మాస్క్ అమర్చి దాని ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపారు. అది పీల్చుకున్న రెండు నిముషాల తర్వాత ఆయన మరణించాడు. దీంతో 22 నిముషాల తర్వాత ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు.
1982 నుంచి దేశంలో మరణ శిక్షలు అమలు చేస్తున్న అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్షను విధించడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారి. సాధారణంగా అమెరికాలో విషం ఇంజక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేస్తున్నారు.
