Namaste NRI

తమన్నా భాటియా  ఓదెల 2 షూటింగ్ మొదలు

ఓదెల రైల్వేస్టేషన్‌కు  సీక్వెల్‌గా ఓదెల2  పేరుతో ఇప్పుడు మరో సినిమా రానుంది. తమన్నా భాటియా ఇందు లో ప్రధానపాత్రధారి. అశోక్‌ తేజనే ఈ సినిమాకు దర్శకుడు. సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ పతాకాలపై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హెబ్బాపటేల్‌, వశిష్ట ఎన్‌ సింహా ఇతర పాత్రలు పోషిస్తు న్నారు.  ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశాన్ని తమన్నాపై మేకర్స్‌ చిత్రీకరించారు. ఓదెల2 థ్రిల్లింగ్‌ కలిగించే కథ అని, సంస్కృతి, సంప్రదాయాలలోపాటు ఓదెల మల్లన్న స్వామి ఓ గ్రామాన్ని దుష్టశక్తులనుంచి ఎలా రక్షించాడనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశమని, ఆధ్యాత్మికత తో కూడిన థ్రిల్లర్‌ సినిమా ఇదని, వీఎఫ్‌ఎక్స్‌ సినిమాలో టాప్‌ క్లాస్‌గా ఉండబోతున్నాయని మేకర్స్‌ చెబుతు న్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌ ఎస్‌., సంగీతం: రజనీష్‌ లోక్‌నాథ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events