అమెరికా దేశాధ్యక్షుడు జో బెడైన్ మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడనున్నారు. ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన నామినేషన్ ఖరారు అయ్యింది. డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు 1968 డిలీగేట్లను నెగ్గాల్సి ఉంటుంది. అయితే నామినేషన్‌కు కావాల్సిన సంఖ్యా బలాన్ని ఆయన దాటివేసినట్లు ఎడిసన్ రీసర్చ్ తెలిపింది. జార్జియా రాష్ట్రా నికి చెందిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలు వెలుబడడంతో బైడెన్ రూట్ క్లియర్ అయ్యింది. ఇంకా మిస్సిసిపీ, వాషింగ్టన్ స్టేట్, నార్తర్న్ మారియానా ఐలాండ్స్ ఫలితాలు రావాల్సి ఉన్నది. బహుశా ఆయన తుది పోరులో రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌తోనే అధ్యక్ష రేసులో పోటీపడే ఛాన్సు ఉన్నది. అమెరికాలోని గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీపడే అవకాశాలు ఉన్నాయి.
