పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్‌హట్టన్‌లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించింది. జూన్ మధ్య నుంచి ఇది అమల్లోకి రానుంది. రద్దీ టోల్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ 11-1 ఓట్లతో ఆమోదించింది.