యునైటెడ్ కింగ్డమ్లో సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఓ సర్వే వెల్లడిరచింది. ఉత్తర యార్క్‌షైర్‌లోని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సీటు కూడా అనుమానాస్పదమేనని ఆ సర్వే సూచించింది. బెస్ట్ ఫర్ బ్రిటన్ తరఫున సర్వేషన్ 15209 మంది వ్యక్తులపై నిర్వహించిన ఎంఆర్పి పోల్ ప్రకారం ప్రతిపక్ష లేబర్ పార్టీ కన్జర్వేటివ్‌లపై 19 పాయింట్ల ఆధిక్యంతో 45 శాతం వోట్ల వాటాతో అగ్ర స్థానంలో ఉన్నది. గత సంవత్సరాంతంలో ఆ గ్రూప్ నిర్వహించిన పోల్ కన్నా మూడు పాయింట్లు ఎక్కువగా లేబర్ పార్టీకి వచ్చాయి.
లేబర్ పార్టీకి 468 సీట్లు లభించవచ్చు. ప్రతిపక్ష నేత సర్ కెయిర్ స్టార్మర్ పార్టీకి 286 సీట్ల ఆధిక్యం లభించ వచ్చు. ఎన్నికలను రేపే నిర్వహించే పక్షంలో సునాక్ కన్జర్వేటివ్‌లు దేశ వ్యాప్తంగా 250 మంది ఎంపిలను కోల్పోవచ్చునని, లేబర్ పార్టీ 468 సీట్లు గెలుస్తుందని ఆ సర్వే సూచించింది. సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటి వ్‌లకు ఇది అత్యంత ఘోరమైన ఫలితం కానున్నది అని బెస్ట్ ఫర్ బ్రిటన్ విశ్లేషణ పేర్కొన్నది. కన్జర్వేటివ్ పార్టీకి ఈ నష్టం అంతటితో ఆగకపోవచ్చు. ప్రధాని రిషి సునాక్ రిచ్మండ్, నార్తల్లెర్టన్ సీటూ ప్రమాదంలో ఉన్నది. లేబర్ పార్టీ ఆయన కన్నా కేవలం 2.4 శాతం వెనుకంజలో ఉన్నది. అదే పరిస్థితి ఆర్థిక శాఖ మంత్రి జెరెమీ హంట్ కొత్త సీటు గోడాల్మింగ్, ఏష్ విషయంలో ఎదురు కావచ్చు. అక్కడ లిబరల్ డెమోక్రాట్లు కేవలం ఒక శాతం వెనుకంజలో ఉన్నారు అని ఆ సర్వే వివరించింది.