Skip to main content

Namaste NRI

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్

యువ కథానాయకుడు రోషన్‌ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్‌రాజ్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అగ్ర హీరో రామ్‌చరణ్‌ గ్లింప్స్‌ని లాంచ్‌ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

హీరో నాని వాయిస్‌తో ఈ గ్లింప్స్‌ మొదలవ్వడం విశేషం. రోషన్‌ రగ్గడ్‌ అవతారంలో ఆకట్టుకున్నాడు. సాక్షి మడోల్కర్‌ కథానాయికగా, బండి సరోజ్‌కుమార్‌ విలన్‌గా మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశారు. 2025లో అటవీ నేపథ్యం సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్టు గ్లింప్స్‌ చెబుతున్నది. అటవీ నేపథ్య సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి.ఎం, సంగీతం: కాలభైరవ.

Social Share Spread Message

Latest News