Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

 టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బ. డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు  వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్‌ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీల్ల కోర్టు తీర్పుపై ట్రంప్‌ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.

Social Share Spread Message

Latest News