Skip to main content

Namaste NRI

పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నుంచి..సువ్వి సువ్వి.. సందడి షురూ   

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎస్‌.తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  

తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం సువ్వి సువ్వి విడుద లైంది. ఫైర్‌ స్టార్మ్‌కి పూర్తి భిన్నంగా హదయాలను హత్తుకునేలా ఈ గీతం సాగింది. తమన్‌ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రేమ గీతాన్ని తమన్‌ ఎంత అందంగా స్వరపరిచారో,  గాయని శృతి  రంజని అంతే మధురంగా ఆలపించారు. కళ్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. ప్రేమ పాటలను స్వరపరచడంలో దిట్టగా తమన్‌ ఎందుకు రాజ్యమేలుతున్నారో ఈ గీతం మరోసారి రుజువు చేసింది. ఈ పాటలో పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ గంభీరాన్ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్‌ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, ప్రకాష్‌ రాజ్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్‌, మనోజ్‌ పరమహంస, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి, నిర్మాణం: డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News