గాజాలోని వరల్డ్ సెంట్రల్ కిచెన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు అంతర్జాతీయ సహాయ కార్మికులు మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టక రమని, అనుకోకుండా జరిగిందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యుద్ధ సమయంలో ఇలాంటి ఘటనలు జరుతుంటాయని పేర్కొన్నారు. కాగా, మృతుల్లో ఒకరు భారత సంతతి ఆస్ట్రేలియా మహిళ జోమి ఫ్రాంక్‌కామ్ ఉన్నారని అక్కడి అధికారిక వర్గాలు ప్రకటించాయి. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీఎఫ్ బలగాలే ఇందుకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. తమ లొకేషన్, ఇక్కడ పనిచేస్తున్న కార్మికల కదలికల సమాచారం ఐడీఎఫ్‌తో పంచుకున్నామని, అయినప్పటికీ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌పై ఐడీఎఫ్ దాడులకు తెగబడిందని ఫుడ్ చారిటీ ఆరోపించింది.